8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్?
- నెట్‌ఫ్లిక్స్ 'దేశి బ్లింగ్' షోతో వెలుగులోకి వచ్చిన సతీష్ సన్‌పాల్
- 8వ తరగతి డ్రాపవుట్ నుంచి దుబాయ్‌లో బిలియనీర్‌గా ఎదిగిన వైనం
- బుర్జ్ ఖలీఫాలో నివాసం, భార్యకు 40 కేజీల బంగారం బహుమతి
- కూతురి కోసం బంగారు డ్రెస్, పింక్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు
- సుమారు రూ.25,000 కోట్ల విలువైన కంపెనీకి చైర్మన్‌గా ఉన్న సతీష్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'దేశి బ్లింగ్' షో ద్వారా ఓ భారతీయ బిలియనీర్ కథ వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అల్ట్రా రిచ్ భారతీయుల విలాసవంతమైన జీవితాన్ని చూపించే ఈ షోలో సతీష్ సన్‌పాల్ అనే వ్యాపారవేత్త అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 8వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసి, రూ.25,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన సక్సెస్ స్టోరీ ఆశ్చర్యపరుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సతీష్ సన్‌పాల్, తన 15 ఏళ్ల వయసులో తల్లి దగ్గర రూ.50,000 అప్పుగా తీసుకుని ఓ కిరాణా దుకాణం ప్రారంభించారు. కానీ ఆ వ్యాపారం నష్టాల్లో ముగిసింది. అనంతరం స్టాక్ మార్కెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుని, ఆ తర్వాత దుబాయ్ వెళ్లారు. అక్కడ గోల్డ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన 'ఏఎన్ఏఎక్స్ హోల్డింగ్' అనే కంపెనీకి చైర్మన్‌గా ఉన్నారు. ఈ కంపెనీ విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) కావడం విశేషం.
సతీష్ సన్‌పాల్, ఆయన భార్య తబిందా దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నారు. తబిందా వద్ద ఏకంగా 40 కేజీల బంగారం ఉంది. సతీష్ ఏటా ఆమెకు 3 కేజీల బంగారం కొనిస్తారట. వివాహమైన 9 ఏళ్ల తర్వాత పుట్టిన తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు కట్లరీ, మొదటి పుట్టినరోజున 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకంగా డ్రెస్ తయారు చేయించారు. అంతేకాకుండా, ఆమె కోసం పింక్ రంగు రోల్స్ రాయిస్ కారును కూడా కొనుగోలు చేశారు.
ఈ షోలో సతీష్ తన స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ యాట్‌ను కొనుగోలు చేసినట్లు చూపించారు. ఇందులో కేవలం మగవాళ్లకు మాత్రమే పార్టీలు ఇస్తారని, భార్యలకు అనుమతి లేదని చెప్పడం గమనార్హం. మొత్తం మీద ఈ షో భారీ సంపద, బంగారంపై మోజు, విలాసవంతమైన జీవనశైలిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇందులో టీవీ తారలు తేజస్వీ ప్రకాష్, కరణ్ కుంద్రా కూడా కనిపించారు.